మరో మెగా ఈవెంట్‌కు సిద్ధమవుతోన్న ఖైదీ టీమ్!

khaidi150-1
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ రికార్డు వసూళ్ళతో దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా ఎక్కడా తగ్గకుండా అన్నిచోట్లా భారీ కలెక్షన్స్ సాధిస్తూ వెళుతోంది. ఇక తమ సినిమాకు ఈ స్థాయి ఆదరణ చూపిస్తోన్న అభిమానులు, ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ, టీమ్ ఒక థ్యాంక్యూ మీట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తుందట. సినిమా విడుదలకు ముందు నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లానే ఈ థ్యాంక్స్ మీట్‌ను పెద్ద ఎత్తున నిర్వహించాలనుకుంటున్నారట.

ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను గుంటూరులో నిర్వహించడంతో, ఇప్పుడు ఈ థ్యాంక్యూ ఈవెంట్‌ను హైద్రాబాద్‌లో ప్లాన్ చేస్తున్నారట. రామ్ చరణ్, చిరు సహా టీమ్ అంతా పాల్గొనే ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రైతు సమస్యలను ప్రస్తావించడంతో పాటు, చిరు స్టైల్ అంశాలన్నింటినీ మేళవించుకొని ప్రేక్షకులను అలరిస్తోంది.