కార్తీ ‘ఖైదీ’ మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్.

khaidi1

కార్తీక్ ఖైదీ చిత్రం వసూళ్ల పరంపర కొనసాగుతుంది. డొమెస్టిక్ మరియు ఓవర్ సీస్ లో కూడా ఖైదీ మెరుగైన వసూళ్లు రాబడుతుంది. తాజా సమాచారం ప్రకారం ఖైదీ తమిళ వర్షన్ వరల్డ్ వైడ్ గా 80కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఖైదీ విడుదలైన 12 రోజులకు ఈ మొత్తం వసూళ్లు సాధించి అబ్బురపరిచింది. ఖైదీ చిత్ర బడ్జెట్ మరియు థియరిటికల్ రైట్స్ అమ్మిన రేటుతో పోల్చుకుంటే ఖైదీ బయ్యర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టినట్టే లెక్క. చెన్నై సిటీలో కూడా ఖైదీ వసూళ్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. గత శనివారం 37లక్షల వసూళ్లు సాధించిన ఖైదీ రెండవ శనివారం కూడా 37లక్షల వసూళ్లు సాధించడం విశేషం.

ఇక తెలుగులో ఖైదీ మూవీ ఎప్పుడో బ్రేక్ ఈవెన్ కి చేరింది. నాపేరు శివ చిత్రం తర్వాత కార్తీ ఖైదీ చిత్రంతో తెలుగులో హిట్ అందుకున్నారు. ఫ్యామిలీ సెంటిమెంట్ మరియు యాక్షన్ ఎంటర్టైనర్ అయిన ఈ చిత్రాన్ని దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రయోగాత్మకంగా తెరకెక్కించారు. పాటలు, హీరోయిన్ వంటి కమర్షియల్ అంశాలు లేకుండా కేవలం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో దర్శకుడు చిత్రాన్ని నడిపించిన తీరు అందరిని కట్టిపడేసింది. ఇక హీరో కార్తీ నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.

Exit mobile version