‘ఖైదీ నెం 150’ ఈస్ట్ గోదావరి రైట్స్ ఎంత పలికాయంటే !

khaidi-150-1
ప్రసుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎక్కడ చూసినా మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ చర్చే నడుస్తోంది. ఎనిమిదేళ్ల తరువాత చిరు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా పట్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పైగా విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్స్, పాటలు అన్నీ అంచనాలకు తగ్గట్టు బాగుండటంతో క్రేజ్ మరింతగా పెరిగిపోయింది.

ఈ క్రేజ్ ను ఎప్పటికప్పుడు గమనిస్తున్న డిస్ట్రిబ్యూషన్ వర్గాలు సినిమా హక్కుల కోసం భారీ పోటీ పడుతున్నాయి. భారీ మొత్తాన్ని చెల్లించి హక్కుల్ని కైవసం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెగా ఫ్యామిలీకి మంచి ఫాలోయింగ్ ఉన్న ఈస్ట్ గోదావరి జిల్లా హక్కులు రూ. 5.60 కోట్ల భారీ ధర పలికాయి. డిస్ట్రిబ్యూటర్లు ఇంత భారీ మొత్తం వెచ్చించడానికి ఒకే ఒక కారణం చిరంజీవి క్రేజ్ మీదున్న నమ్మకమేనని నిస్సందేహంగా చెప్పవచ్చు.