‘బాహుబలి’ తరువాత అంత భారీ మొత్తం పలికిన చిత్రం ‘ఖైదీ నెం.150’

chiru-150
మెగాస్టార్ చిరంజీవి 8 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’. ఈ చిత్రంపై మెగా అభిమానుల్లోనే గాక సగటు సినీ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. తమిళ ‘కత్తి’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తాలూకు ఫస్ట్ లుక్ ఈ మధ్యే విడుదలై మంచి స్పందన కూడా తెచ్చుకుంది. ఈ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే డిస్ట్రిబ్యూటర్లు చిత్రం హక్కుల కోసం ఎంత భారీ మొత్తాన్నైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారు.

తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారాం ప్రకారం ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్టు తెలుస్తోంది. క్లాసిక్ సినిమాస్ ఈ హక్కులను రూ.13.50 కోట్లకు కొన్నారట. అంతేగాక ఓవర్సీస్ లో సినిమా భారీ వసూళ్లను కొల్లగోడుతుందన్న ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారట. ఈ ఫీట్ తో ‘బాహుబలి – ది బిగినింగ్’ తరువాత ఓవర్సీస్ హక్కుల విషయంలో భారీ మొత్తం పలికిన చిత్రంగా ‘ఖైదీ నెం. 150’ నిలిచింది. ఇకపోతే చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2017 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు.