ఆన్‌లైన్లో దూసుకుపోతోన్న ‘ఖైదీ’ పాటలు!

25th, December 2016 - 10:43:04 AM

khaidi

మెగాస్టార్ చిరంజీవి చాలాకాలం తర్వాత సినిమాలకు రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ‘ఖైదీ నెం. 150’ కోసం అభిమానులంతా ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ఒక్కోటిగా విడుదలవుతోన్న పాటలు సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చేస్తున్నాయి. నిన్న సాయంత్రం విడుదలైన సుందరి అనే పాట ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్ సాధించి దూసుకుపోతోంది. దేవిశ్రీ స్టైల్లో సాగే ఈ పాటకు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తోంది.

ఇక అదేవిధంగా కొద్దిరోజుల క్రితం విడుదలైన అమ్మడు అన్న పాట కూడా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. నేడు పూర్తి ఆడియో ఆన్‌లైన్లో విడుదల కానున్నట్లు సమాచారం. చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. జనవరి 11న సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.