వారాంతంలో జోరందుకున్న ‘ఖైదీ నంబర్ 150’!
Published on Jan 15, 2017 3:29 pm IST

khaidi
మెగాస్టార్ చిరంజీవిని ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా? అన్న ఆయన అభిమానుల కల నెరవేర్చేస్తూ దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇస్తూ చిరు ‘ఖైదీ నంబర్ 150’తో వచ్చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్యన జనవరి11న విడుదలైన ఈ సినిమా అభిమానులను విపరీతంగా ఆకట్టుకొని సూపర్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఇక రెండో రోజునుంచి గౌతమిపుత్ర శాతకర్ణికి కొన్ని థియేటర్లు వెళ్ళిపోవడంతో కలెక్షన్స్ కాస్త తగ్గినా, మళ్ళీ వారాంతం వచ్చేసరికి కలెక్షన్స్ జోరందుకున్నాయి.

ముఖ్యంగా నిన్న శనివారం, పండగరోజున సెలవు కావడంతో, ఓపెనింగ్ డే తర్వాత ఆ స్థాయి కలెక్షన్స్ నిన్ననే వచ్చాయి. ఇక నేడు ఆదివారం కావడంతో కలెక్షన్స్ జోరు ఏమాత్రం తగ్గదని ట్రేడ్ భావిస్తోంది. మొదటివారం పూర్తయ్యేసరికి పలు చోట్ల ఈ సినిమా బాహుబలి రికార్డులను సైతం బ్రేక్ చేస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మించారు.

 
Like us on Facebook