‘ఖైదీ నెం 150’ ఓవర్సీస్ వసూళ్ల వివరాలు !

khaidi150-1
ఈ మధ్య కాలంలో బాహుబలి తరువాత అంతటి క్రేజ్ తో భారీ ఎత్తున విడుదలైన చిత్రం ‘ఖైదీ నెం 150’. మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తరువాత రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా కావడం వలన ఈ సినిమాకు భారీ క్రేజ్ దక్కింది. ప్రపంచవ్యాప్తంగా దగ్గరదగ్గర 2000 థియేటర్లలో రిలీజైన ఈ సినిమా అన్ని చోట్ల రికార్డ్ కలెక్షన్లను రాబట్టింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించింది. మొదటి రోజు మంగళవారం ప్రీ మీయర్ల రూపంలో 1.27 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.

రెండవరోజు కూడా అదే జోరును కొనసాగిస్తూ 156, 094 డాలర్లను వసూలు చేసి అత్యంత వేగంగా 1.5 మిలియన్ డాలర్లకు దగ్గరపడింది. మొత్తం రెండు రోజులకు కలిపి చూస్తే 1.43 మిలియన్ డాలర్లు అనగా 9. 47 కోట్లను రాబట్టింది. ఈ లెక్కలతో బాహుబలి తరువాత ఓవర్సీస్ లో భారీ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ఖైదీ నిలిచింది. వి.వి.వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని చిరు తనయుడు రామ్ చరణ్ స్వయంగా నిర్మించాడు.