మరో క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిన ఖైదీ విలన్ !

tarun-arora
తాజాగా తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యాడు కొత్త విలన్ ‘తరుణ్ అరోరా’. స్టైలిష్ లుక్స్ తో కార్పొరేట్ స్టైల్ లో కనిపించే ఇతను తాజాగా మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్ర చేసి ఒక్క సినిమాతోనే భారీ పాపులారిటీ తెచ్చుకున్నాడు. దీంతో ఆయనకు తెలుగులో మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

తాజాగా బోయపాటి శ్రీను తన డైరెక్షన్లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిస్తున్న సరికొత్త ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్లో ఇతడిని విలన్ గా ఖాయం చేసుకున్నట్టు సమాచారం. ఈ మధ్యే ప్రీ లుక్ రిలీజ్ చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇది కాకుండా తరుణ్ అరోరా పవన్ కళ్యాణ్ – డాలీల కాంబినేషన్లో రూపొందుతున్న ‘కాటమరాయుడు’ చిత్రంలో కూడా ఒక నెగేటివ్ రోల్ లో కనిపించనున్నాడు.