నైజాంలో “ఖిలాడి” 3 రోజుల వసూళ్ల వివరాలు.!

Published on Feb 14, 2022 1:35 pm IST


మాస్ మహారాజ్ రవితేజ హీరోగా డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరి లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “ఖిలాడి”. రవితేజ కెరీర్ లో మాస్ హిట్ “క్రాక్” తర్వాత వచ్చిన ఈ చిత్రం మంచి స్టైలిష్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయ్యి డీసెంట్ ఓపెనింగ్స్ అందుకుంది. దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ నే అన్ని ఏరియాల్లో అందుకుంది అయితే ఇప్పుడు నైజాం లో ఈ చిత్రం వసూళ్లకు సంబంధించి వివరాలు తెలుస్తున్నాయి.

ఈ చిత్రం ఈ మూడు రోజుల్లో కలిపి నైజాం 2.4 కోట్ల రూపాయల షేర్ ని రాబట్టిందట. అయితే ఇది ఈ సినిమా టార్గెట్ కి కాస్త తక్కువ నెంబర్ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు వీక్ స్టార్ట్ లో పరిస్థితి మరింత తగ్గొచ్చు.. ప్రస్తుతానికి అయితే మౌత్ టాక్ ఓ మాదిరి గానే ఉన్నా సినిమా వసూళ్లు ఎక్కడ ఆగుతాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వగా పెన్ మూవీస్ మరియు ఏ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :