“ఖిలాడి” నుంచి మాస్ మహారాజ్ అదిరే ట్రీట్!

Published on Aug 21, 2021 7:01 pm IST

ఈ ఏడాది “క్రాక్” సినిమాతో అదిరే హిట్ అందుకొని శాలి కం బ్యాక్ ఇచ్చిన మాస్ మహారాజ్ రవితేజ దాని తర్వాత ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా దర్శకుడు రమేష్ వర్మతో ఓ సాలిడ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ ని షురూ చేసేసాడు. అదే “ఖిలాడి”. డ్యూయల్ రోల్ లో రవితేజ నటిస్తున్న ఈ చిత్రం కూడా ఆల్ మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యిపోయింది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు మంచి కిక్ ఇచ్చే బజ్ ఇప్పుడు వినిపిస్తుంది.

రవితేజ తన నటనతోనే కాకుండా తన గాత్రంతో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ని ఇస్తాడన్న సంగతి తెలిసిందే.. అలా ఇప్పటి వరకు ఎన్నో హిట్ సాంగ్స్ తన సినిమాల్లో పాడాడు. అలాగే ఈసారి కూడా ఈ చిత్రంలో ఒక అదిరే సాంగ్ ని తానే పడనున్నట్టు తెలుస్తుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఆల్రెడీ ఒక ఎనర్జిటిక్ నెంబర్ ను రవితేజతో ప్లాన్ చేసారని తెలుస్తుంది. మరి ఈ సాంగ్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :