రవితేజ “ఖిలాడి” నుండి ఫుల్ కిక్ మోడ్ లో ఫోర్త్ సింగిల్ విడుదల కి సిద్దం!

Published on Jan 19, 2022 1:05 pm IST


రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఖిలాడి. పెన్ మూవీస్ మరియు ఏ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్నిసత్యనారాయణ కోనేరు మరియు రమేష్ వర్మ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మీనాక్షీ చౌదరీ, డింపుల్ హాయాతి లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, అర్జున్ సర్జ కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి ఫోర్త్ సింగిల్ కి సంబంధించిన ఒక అప్డేట్ ను చిత్ర యూనిట్ వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం లోని ఫుల్ కిక్ మోడ్ ఫోర్ట్ సింగిల్ ను జనవరి 26 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :