“ఖిలాడి” ఫస్ట్ సింగిల్ దూకుడు తగ్గడం లేదుగా..!

Published on Oct 8, 2021 3:00 am IST


మాస్ మహారాజ రవి తేజ హీరోగా, మీనాక్షి చౌదరీ, డింపుల్ హాయాతీ హీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖిలాడి’. ఎ స్టూడియోస్ పతాకంపై సత్యనారాయణ కోనేరు మరియు రమేష్ వర్మలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో గత నెల వినాయకచవితి సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఇస్టం’ అంటూ సాగే లిరికల్ వీడియో సంగ్ విడుదలయ్యింది.

అయితే ఇప్పటి వరకు ఈ సాంగ్‌కు 7 మిలియన్‌కి పైగా వ్యూస్‌ని సాధించింది. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా, హరిప్రియ ఆలపించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ప్రతినాయకుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తుండగా, సచిన్ కేడ్కర్, ఉన్ని ముకుందన్, ముఖేశ్ రుషి, రావు రమేశ్, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :