రవితేజ “ఖిలాడి” ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్

Published on Feb 6, 2022 9:19 pm IST


మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఖిలాడి. ఈ చిత్రం ను పెన్ స్టూడియోస్ మరియు ఏ స్టూడియోస్ పతాకాల పై సత్యనారాయణ కోనేరు మరియు రమేష్ వర్మ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

ఈ చిత్రం నుండి ట్రైలర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం ట్రైలర్ ను రేపు సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం లో మీనాక్షి చౌదరీ, డింపుల్ హాయాతీ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ను ఫిబ్రవరి 11 వ తేదీన భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :