“ఖిలాడీ” ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముహూర్తం ఫిక్స్..!

Published on Feb 8, 2022 8:08 pm IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా, రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఖిలాడీ”. పెన్ స్టూడియోస్ మరియు ఏ స్టూడియోస్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు మరియు రమేష్ వర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11, 2022న విడుదల కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా జరుపుకుంటున్న ఈ చిత్రం తాజాగా ప్రీ రిలీజ్ వేడుకకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుంది.

రేపు హైదరాబాద్ బంజారహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో సాయంత్రం 6:00 గంటలకు ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరగనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు మరియు రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :