హాట్ కేకులా జరిగిన “ఖిలాడీ” బిజినెస్..!

హాట్ కేకులా జరిగిన “ఖిలాడీ” బిజినెస్..!

Published on Jan 28, 2022 9:00 PM IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ థ్రిల్లర్ “ఖిలాడీ”. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోశిస్తున్న రవితేజ సరసన డింపుల్ హయతి మరియు మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

మంచి అంచనాల నడుమ ఫిబ్రవరి 11వ తేదిన ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా బిజినెస్ హాట్ కేకులా జరిగినట్టు తెలుస్తుంది. థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ రైట్స్ పూర్తిగా అమ్ముడుపోయాయని, రవితేజ కెరీర్‌లోనే ఇది ఆల్ టైం హైయెస్ట్ రికార్డ్ అని సమాచారం. ట్రేడ్ వర్గాలు చెబుతున్న ప్రకారం నైజాంలో 9 కోట్లు, సీడెడ్ లో 3.6 కోట్లు, ఆంధ్రాలో 11 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. అయితే ఓవరాల్‌గా ఇండియాలో, ఓవర్సీస్ లోనూ ఎంత బిజినెస్ జరిగిందనేది తెలియాల్సి ఉంది. ఇక ఓటీటీ, శాటిలైట్ అమ్మకాలు అదనం అని చెప్పాలి. ఏదేమైనా రిలీజ్‌కి ముందే “ఖిలాడి” మూవీ మంచి క్రేజ్‌ని సంపాదించుకుందనే చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు