సూపర్ స్టైలిష్ బీట్ లో “ఖిలాడి” టైటిల్ ట్రాక్.!

Published on Nov 4, 2021 1:00 pm IST


మాస్ మహరాజ్ రవితేజ జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా “ఖిలాడి”. దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రవితేజ కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ మరియు భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతుంది. అయితే రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ ఆల్బమ్ నుంచి ఇప్పుడు దీపావళి కానుకగా చిత్ర యూనిట్ టైటిల్ ట్రాక్ ని రిలీజ్ చేసారు.

ఇది మాత్రం అంచనాలు ఏమాత్రం తీసిపోకుండా స్టైలిష్ బీట్ తో మంచి హమ్మింగ్ చేసే విధంగా అనిపిస్తుంది. అలాగే సాంగ్ లో విజువల్స్ రవితేజ డ్రెస్సింగ్ కానీ హైలైట్ అనిపిస్తున్నాయి. ఇంకా రవితేజ రోల్ సినిమాలో ఎలా ఉంటుంది అనే విధంగా లిరిక్స్ కూడా బాగున్నాయి. మొత్తానికి మాత్రం సాంగ్ అయితే డిజప్పాయింట్ చేసే విధంగా ఎక్కడా లేదు.. సో ఖిలాడి ఖాతాలో ఇంకో హిట్ సాంగ్ యాడ్ అయ్యినట్టే అని చెప్పాలి. మరి ఈ సినిమాలో రవితేజ రెండు పాత్రలు చేస్తుండగా మీనాక్షి, డింపుల్ హాయాతి లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ మరియు ఏ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :