దీపావళికి “ఖిలాడి” నుంచి అదిరిపోయే కానుక..!

Published on Nov 1, 2021 9:58 pm IST


మాస్ మహారాజ రవి తేజ హీరోగా, మీనాక్షి చౌదరీ, డింపుల్ హాయాతీ హీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖిలాడి’. ఎ స్టూడియోస్ పతాకంపై సత్యనారాయణ కోనేరు మరియు రమేష్ వర్మలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన “ఇష్టం” అనే పాటకు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

అయితే ఈ సినిమా నుంచి దీపావళికి అదిరిపోయే కానుక రాబోతుంది. నవంబర్ 4వ తేదిన ఉదయం 10:08 గంటలకు ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రతినాయకుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తుండగా, సచిన్ కేడ్కర్, ఉన్ని ముకుందన్, ముఖేశ్ రుషి, రావు రమేశ్, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More