సమంత కి గ్రాండ్ గా వెల్కమ్ పలికిన ‘ఖుషి’ టీమ్

Published on Mar 8, 2023 10:00 pm IST

విజయ్ దేవరకొండ హీరోగా సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఖుషి. గతంలో టక్ జగదీష్, నిన్ను కోరి, మజిలీ వంటి హృద్యమైన సినిమాలు తెరకెక్కించిన శివ నిర్వాణ ఈమూవీని కూడా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది యూనిట్. ఇక ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ సెట్స్ లోకి నేడు సమంత రూత్ ప్రభు ఎంట్రీ ఇచ్చారు.

ఇక నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమంత తో స్పెషల్ గా కేక్ కట్ చేయించి యూనిట్ ఆమెకు గ్రాండ్ గా వెల్కమ్ పలికారు యూనిట్. ఇటీవల సమంత కెరీర్ పరంగా 13 ఏళ్ళు సక్సెసుల్ గా పూర్తి చేసుకున్న సందర్భంగా యూనిట్ ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. కాగా ఖుషి మూవీకి హేషమ్ అద్బుల్ వాహాబ్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై దీనిని నవీన్ యెర్నేని, రవిశంకర్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :