తమిళనాడు లో మ్యాసివ్ రికార్డు సొంతం చేసుకున్న ‘ఖుషి’

Published on Sep 7, 2023 1:05 am IST

విజయ్ దేవరకొండ హీరోగా సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఖుషి. ఇటీవల పలు భాషల ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం మంచి టాక్ తో కలెక్షన్ తో థియేటర్స్ లో కొనసాగుతోంది. హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.

ఇక హీరోగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ నాడులో కూడా మంచి క్రేజ్ కలిగిన విజయ్ ఈ మూవీతో అక్కడ ఒక మ్యాజివ్ రికార్డు సొంతం చేసుకున్నారు. 2023 లో తమిళనాడులో రిలీజ్ అయి అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకున్న తెలుగు మూవీగా ఖుషి నిలిచింది. కాగా ఈ మూవీకి అక్కడ రూ. 7 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లభించడం విశేషం. అయితే ఈ కలెక్షన్ తెలుగు, తమిళ వెర్షన్స్ కలిపి లభించిన మొత్తం. మరి రాబోయే రోజుల్లో ఏ సినిమా ఈ రికార్డుని బీట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :