శంకర్ – చరణ్ 15 పై కియారా ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Jul 3, 2022 12:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ కాంబోలో ఇద్దరి కెరీర్ లో కూడా బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది. మరి పాన్ ఇండియా స్థాయిలో అనేక అంచనాలు నెలలకొల్పుకున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన మరోసారి హీరోయిన్ గా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే ఈ యంగ్ హీరోయిన్ ఇంకోపక్క పలు బాలీవుడ్ సినిమాలు కూడా చేసి మంచి హిట్స్ అందుకుంటుంది. అయితే ఇప్పుడు శంకర్ మరియు రామ్ చరణ్ ల సినిమాపై ఆమె కొన్ని కామెంట్స్ బాలీవుడ్ మీడియాతో చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో ఇప్పటివరకు నేను చేసిన సినిమాల నుంచి వేరే ప్రపంచంలా ఉంటుంది.

శంకర్ మ్యాజిక్ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఈ సినిమా కథ నా పాత్ర లార్జర్ థన్ లైఫ్ లా ఉంటాయి. సెట్స్ లో తానెప్పుడూ చాలా సాఫ్ట్ గా ఉంటూ అంతా గమనిస్తానని నాకు ఇంకా నాలుగు షెడ్యూల్స్ షూటింగ్ ఉంది. ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నానని ఆమె అని తెలిపింది..

సంబంధిత సమాచారం :