మాతృత్వ దశ పై స్టార్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్ !

Kiara Advani

బాలీవుడ్‌ బ్యూటీ కియారా అడ్వాణీ తన లేటెస్ట్ లుక్ తో ఫుల్ గా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఐతే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ తన మాతృత్వ దశ పై క్రేజీ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆమె ఏం మాట్లాడింది అంటే.. ‘నిజం చెప్పాలంటే.. తల్లిని అయ్యాక నాలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు నేను ఆడపులిలా మారానని అనిపిస్తోంది. మునుపటి కంటే నా జీవితాన్ని చూసే కోణం భిన్నంగా ఉంది. ఒకప్పుడు నాలో ఎన్నో భయాలు ఉండేవి. ఇప్పుడు అవి ముఖ్యం కానట్టు అనిపిస్తుంది’ అని కియారా చెప్పుకొచ్చింది.

కియారా తన భర్త సిద్ధార్థ్‌ మల్హోత్రా గురించి మాట్లాడుతూ.. ‘నా భర్త గురించి మీకు తెలుసు. తను ఎప్పుడూ సరదాగా ఉంటాడు. పెళ్లికి ముందు మా మధ్య ఉన్న సరదా కబుర్లు, కలిసి ప్రయాణాలు చేయడం లాంటివి, పెళ్లి తర్వాత కూడా ఉన్నాయి. నటీనటులుగా, సినిమా ప్రేమికులుగా ఆ చిత్రాల గురించి చర్చించుకోవడం మాకు చాలా ఇష్టం. ఇక నాకు ఎప్పుడూ నటిని అవ్వాలని ఉండేది. చిన్నప్పుడే నాలో ఆ కోరిక ఉందని మా తల్లిదండ్రులు పసిగట్టారు. వారి ప్రోత్సాహంతోనే చిత్రపరిశ్రమలోకి వచ్చి సక్సెస్ అయ్యాను’ అని కియారా తెలిపింది.

Exit mobile version