ధనుష్ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా కియారా అద్వానీ?

Published on Sep 5, 2023 7:02 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవలే తన కొత్త హిందీ చిత్రం తేరే ఇష్క్ మెయిన్ ను ప్రకటించారు. వినోదాత్మక చిత్రాలను అందించడంలో పేరుగాంచిన ఆనంద్ ఎల్ రాయ్ ఈ చిత్రానికి దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. గతంలో ధనుష్ మరియు ఆనంద్ ఎల్ రాయ్ రాంజనా మరియు ఆత్రంగి రే చిత్రాలకి కలిసి పనిచేశారు. ఈ చిత్రంలో హాట్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుందని తాజా సమాచారం.

నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి కియారా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని కూడా ప్రచారం జరిగింది. ఈ చిత్రంలో కియారా చేరికపై అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు. హిమాన్షు శర్మ, నీరజ్ యాదవ్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ బాణీలు సమకూర్చనున్నారు. హిమాన్షు శర్మ ఈ చిత్రాన్ని బ్యాంక్రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :