హిందీ ‘అర్జున్ రెడ్డి’ పై కియారా అడ్వాణీ ట్వీట్ !

‘అర్జున్ రెడ్డి’ చిత్రం తమిళ, హిందీ భాషల్లోకి కూడా గ్రాండ్ గా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. హిందీలో స్టార్ హీరో షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి పాత్రను పోషిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో షాహిద్ కపూర్ సరసన కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా కియారా అడ్వాణీ తన ట్వీటర్ ద్వారా ఈ సినిమాలో నటించడం పై స్పందించింది.

కియారా ట్వీట్ చేస్తూ.. “నా మొదటి తెలుగు సినిమా షూటింగ్ సమయంలో నేను అర్జున్ రెడ్డిని చిత్రాన్ని చూశాను. అప్పుడు నేను అనుకున్నాను. అర్జున్ రెడ్డి దర్శకుడితో పని చేస్తే బాగుంటుందని. ఈ సినిమాలోని ప్రీతిగా ఎప్పుడు మారాలా అనిపిస్తోంది. ఇక వెయిట్ చెయ్యటం నా వల్ల కాదు’ అని కియారా పోస్ట్ చేసింది.

అయితే కియారా అడ్వాణీ ఈ బోల్డ్ క్యారెక్టర్ లో ఎలా చేస్తుందో చూడాలి మరి. వచ్చే ఏడాది జూన్ 21వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ విడుదల చెయ్యాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండటంతో ఈ చిత్రం పై అక్కడ భారీ అంచనాలే ఉన్నాయి. తెలుగులో అర్జున్ రెడ్డిని తెరకెక్కించిన యువ దర్శకుడు వంగా సుందీప్ నే హిందీ వర్షన్ ను కూడా తెరకెక్కించనున్నారు.

I watched #ArjunReddy last year while I was shooting for my first Telugu film and I told myself I have to work with you. It’s my honour that you saw Preeti in me and I can’t wait to live her character 🙏🏼 @imvangasandeep 🙌🏼 https://t.co/uMcOBXUSot

— Kiara Advani (@Advani_Kiara) September 25, 2018