సీక్రెట్ చెబుతానంటున్న క్రేజీ బ్యూటీ !

సీక్రెట్ చెబుతానంటున్న క్రేజీ బ్యూటీ !

Published on Nov 27, 2022 9:54 PM IST

సిజ్లింగ్ బ్యూటీ కియారా అద్వానీ ఎంఎస్ ధోని సినిమాతో యూత్‌ కి పిచ్చెక్కించింది. ఆ సినిమా నుంచి కియారా వెనుదిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అలాగే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ కొత్త చిత్రంలోనూ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. అయితే, తాజాగా కియారా అద్వానీ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ ప్రస్తుతం చాలా ప్రశ్నలను లేవనెత్తింది. ఇంతకీ, కియారా ఏం పోస్ట్ చేసింది అంటే..

“ఈ విషయాన్ని ఎక్కువ కాలం రహస్యంగా ఉంచలేను! త్వరలో ఆ సీక్రెట్ చెప్పబోతున్నాను. డిసెంబర్ 2న, వెయిట్ చేయండి… ” అని కియారా పోస్ట్ చేసింది. పైగా ఈ పోస్ట్ కి జతగా ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. ఆ వీడియోలో కియారా చాలా అందంగా చాలా ఆనందంగా ప్రకాశిస్తున్న స్టార్ లా కనిపించింది. ఇంతకీ, కియారా.. హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో తన ప్రేమ సంబంధాన్ని అధికారికంగా చెప్పబోతుందా ?, అతన్ని త్వరలో పెళ్లి చేసుకోనుందా ? అంటే.. అవుననే చాలా మంది చెబుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు