చరణ్, శంకర్ భారీ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో ఇచ్చిన కియారా

Published on Oct 15, 2021 7:00 am IST

ఇండియన్ సినిమా దగ్గర తనకంటూ ఒక స్పెషల్ బెంచ్ మార్క్ ని సెట్ చేసుకున్నారు దర్శకుడు శంకర్. కానీ తన స్ట్రాంగ్ కం బ్యాక్ కోసం మాత్రం చాలా మందే ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ తో ఇది మాత్రం కన్ఫర్మ్ అని తెలుస్తుండగా దీనిపై హీరోయిన్ కియారా అద్వానీ లేటెస్ట్ ఇంటర్వ్యూ లో కీలక డీటెయిల్స్ ని ఆమె తెలిపింది. ఈ సినిమా ఒక సాలిడ్ పొలిటికల్ థ్రిల్లర్ గా ఉంటుందట.

అంతే కాకుండా శంకర్ మార్క్ లో ఒక అద్భుతమైన సందేశం కూడా ఉన్నట్టు తెలిపింది. ఇక అలాగే అల్రెడీ సినిమా షూట్ ఒక స్పెషల్ సాంగ్ తో మొదలయ్యింది అని తెలిపింది. భారీ సెట్స్ లో ఒక్క సాంగ్ కోసం ఇన్ని రోజులు తాను వర్క్ చేసింది ఎప్పుడూ లేదని తెలిపింది. మొత్తానికి మాత్రం వీరి కాంబోలో సినిమా మళ్ళీ వింటేజ్ శంకర్ ని గుర్తు చేసే దానిలానే ఉంటుందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More