“విక్రాంత్ రోణ” పై కిచ్ఛా సుదీప్ కీలక వ్యాఖ్యలు!

Published on Jul 24, 2022 9:27 pm IST


కిచ్ఛా సుదీప్ హీరోగా అనూప్ భండారి దర్శకత్వం లో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ విక్రాంత్ రోణ. జులై 28, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో భారీగా విడుదల కానున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కిచ్చ క్రియేషన్స్, శాలిని ఆర్ట్స్, ఇన్వెనియో ఫిల్మ్స్ ఇండియా బ్యానర్ ల పై ఈ చిత్రాన్ని శాలిని జాక్ మంజు, అలంకార్ పాండియన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం పై మంచి బజ్ ఉంది.

తాజాగా ఈ చిత్రం గురించి హీరో కిచ్ఛా సుదీప్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మంచి కంటెంట్, విజువల్ ట్రీట్ ను అందించడానికి ఈ చిత్రాన్ని తీసినట్లు తెలిపారు. ఇతర భారీ బడ్జెట్ చిత్రాలతో పోటీ పడి, డబ్బు సంపాదించడానికి కాదు అని స్పష్టం చేశారు. అయితే ఈ చిత్రం కి తెలుగు రాష్ట్రాల్లో కూడా తక్కువ రేట్ల తోనే టికెట్ ధరలు ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ లో సింగిల్ స్క్రీన్ లలో 150 రూపాయలతో టికెట్ ధరలు ఉండనున్నట్లు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :