లేటెస్ట్..RRR రచయితతో కిచ్చ సుదీప్ గ్లోబల్ ప్రాజెక్ట్.!

Published on Sep 2, 2023 8:00 am IST

కన్నడ సినిమా దగ్గర మంచి స్టార్డం ఉన్న సీనియర్ స్టార్ హీరోస్ లో బాద్షా కిచ్చా సుదీప్ కూడా ఒకరు. మరి మన తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న ఈ హీరో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి “ఈగ” తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాకి అలాగే రాజమౌళి అన్ని చిత్రాలకి సహా గ్లోబల్ సెన్సేషన్ RRR కి రచయితగా చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో అయితే మరోసారి సుదీప్ వర్క్ చేస్తున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది.

మరి ఈరోజు సుదీప్ బర్త్ డే కానుకగా అయితే ఆర్ సి స్టూడియోస్ వారు భారీ బడ్జెట్ తో ఓ గ్లోబల్ ప్రాజెక్ట్ ని అయితే ఇప్పుడు అనౌన్స్ చేశారు. మరి ఈ చిత్రాన్ని రీసెంట్ గా కన్నడ సినిమా దగ్గర భారీ సినిమాగా చేసిన “కబ్జ” దర్శకుడు ఆర్ చంద్రు అయితే దర్శకత్వం వహిస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మొత్తానికి అయితే ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తో కిచ్చా సుదీప్ రానున్న రోజుల్లో రానున్నాడు అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :