ఘనంగా ‘కిల్లర్’ మూవీ టీజర్ విడుదల

Killer

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా సైఫై థ్రిల్లర్ చిత్రం ‘కిల్లర్’. సుకు పూర్వాజ్ (పూర్వాజ్) దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై పూర్వాజ్, ఏ.పద్మనాభరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈ టీజర్ విడుదలైంది.

ఇదొక విమెన్ సెంట్రిక్ మల్టీ లేయర్డ్ సైఫై థ్రిల్లర్ అని దర్శకుడు సుకు పూర్వాజ్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఎమోషనల్ డ్రామా, అన్నాచెల్లెళ్ల అనుబంధం, రివేంజ్ వంటి అంశాలతో ప్రేక్షకులకు సులభంగా అర్థమయ్యేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించామన్నారు. ఇందులో జ్యోతి పూర్వజ్ వ్యాంపైర్, టెర్రరిస్ట్, స్పై ఇలా ఆరేడు విభిన్న పాత్రల్లో నటించడంతో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ అదరగొట్టారని చిత్రయూనిట్ తెలిపింది.

మనీష్ గిలాడ పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీజర్‌తో కేవలం 40 శాతం కంటెంట్‌నే చూపించామని, త్వరలో విడుదల కానున్న ట్రైలర్ మరింత ఆసక్తికరంగా ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version