లేటెస్ట్..ఒకే స్టేజ్ పై మెగాస్టార్ మరియు కింగ్ నాగ్ లు.!

Published on Sep 30, 2022 11:00 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ దిగ్గజ హీరోలు మెగాస్టార్ చిరంజీవి అలాగే కింగ్ నాగార్జున లు హీరోలుగా నటించినటువంటి తమ లేటెస్ట్ చిత్రాలు “గాడ్ ఫాథర్” మరియు “ది ఘోస్ట్” ల కోసం తెలిసిందే. అయితే ఈ రెండు చిత్రాలు కూడా ఈ దసరా కానుకగా ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి. మరి బయట ఆడియెన్స్ కి ఇది పెద్ద ఫైట్ కావచ్చు కానీ చిరు మరియు నాగ్ లు అయితే తమ సినిమాల్లో ఒకొక్కరు ఆల్ ది బెస్ట్ చెప్పుకొని తమ ఫ్రెండ్షిప్ ని అయితే వ్యక్త పరిచారు.

ఇలా తమ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న తాము ఇప్పుడు ఒకే స్టేజి పై అయితే కనిపించనున్నట్టు తెలుస్తుంది. ప్రముఖ ఛానెల్ స్టార్ మా లో జరిగే పరివార్ అవార్డ్స్ కోసం గాను ఈ ఇద్దరు స్టార్స్ రాబోతున్నారట. దీనితో అయితే గాడ్ ఫాథర్ మరియు ది ఘోస్ట్ నాగ్ లు ఒకే స్టేజ్ పై కనిపించి వారి ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తారని చెప్పాలి. ఇక ఈ చిత్రాలు అయితే ఈ అక్టోబర్ 5న తెలుగు సహా హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతున్నాయి.

సంబంధిత సమాచారం :