‘అన్‌ స్టాపబుల్‌’ టీజర్ రిలీజ్ చేసిన నాగార్జున !

‘అన్‌ స్టాపబుల్‌’ టీజర్ రిలీజ్ చేసిన నాగార్జున !

Published on Dec 26, 2022 1:00 PM IST

డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ ‘అన్‌ స్టాపబుల్‌’. ‘అన్‌ లిమిటెడ్‌ ఫన్‌’ అనేది ఉపశీర్షిక. బిగ్‌ బాస్‌ విన్నర్‌ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్‌ హీరోయిన్లు. ఎ2బి ఇండియా ప్రొడక్షన్‌లో రజిత్‌ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌, నిజామాబాద్‌, గోవాలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌తో విడుదలకు ముస్తాబవుతోంది.

ఇక ఇప్పటికే ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఐతే, తాజాగా కింగ్ నాగార్జున ఈరోజు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. థర్టీ ఇయర్స్ పృథ్వీ వాయిస్‌ ఓవర్‌ తో టీజర్ ప్రారంభమైంది. టీజర్ లో సన్నీ, సప్తగిరిలు బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఫన్నీ క్యారెక్టర్స్ లో చాలా ఎంటర్ టైన్ చేస్తూ కనిపించారు. అలాగే, బిత్తిరి సత్తి, షకలక శంకర్, రఘుబాబు పాత్రలు కూడా సరదాగా సాగాయి.

ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉండగానే పలు ఓటీటీ సంస్థల నుంచి ఆఫర్లు రావడం, ఇండిస్టీలో పాజిటివ్‌ టాక్‌ రావడం చాలా హ్యాపీగా ఉంది అని టీమ్ చెబుతుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు