కింగ్ నాగార్జున న్యూ మూవీ లాంచ్ అయ్యేది అప్పుడేనా ?

Published on May 24, 2023 3:00 am IST

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇటీవల కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బంగార్రాజు మూవీతో మంచి సక్సెస్ సొంతం చేసుకోగా ఆ తరువాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఘోస్ట్ మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. దానితో కెరీర్ పరంగా మరొక మంచి సినిమాతో ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చేందుకు సిద్దమైన నాగార్జున, తన నెక్స్ట్ మూవీని జూన్ లో అనౌన్స్ చేయనుండగా దాని యొక్క అధికారిక పూజా కార్యక్రమాలు జూన్ రెండవ వారం తరువాత జరుగనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్.

ఇక ఈ మూవీని జులై తొలి వారంలో షూటింగ్ ప్రారంభించనున్నారట. కాగా ఈ మూవీని అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుండగా దీనిని ఒక మలయాళ థ్రిల్లర్ కి రీమేక్ గా తీయనున్నారట. అలానే ప్రసన్న కుమార్ బెజవాడ ఈ మూవీతో డైరెక్టర్ గా మెగాఫోన్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా పూర్తిగా ఈ మూవీ గురించిన వివరాలు అన్ని కూడా మేకర్స్ నుండి అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :