ట్రైలర్ తో వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ !

Published on Aug 23, 2021 12:51 pm IST


యువ కథానాయకుడు సుశాంత్ హీరోగా ఎస్.దర్శన్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. కాగా తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను కింగ్ నాగార్జున రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం ద్వారా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా పరిచయం అవుతుంది. వెంకట్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం కీలక పాత్రలలో నటిస్తున్నారు.

కాగా ఈ మూవీ ఒక మంచి థ్రిల్లర్ అని కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుందట. ‘చి.ల.సౌ’ లాంటి హిట్ తరువాత సోలో హీరోగా ఈ సినిమా చేస్తోన్న సుశాంత్ కి మళ్లీ హిట్ వస్తోందా ? ఆర్టిస్టులు అండ్ టెక్నిషియన్స్ ల లీస్ట్ చూసుకుంటే సినిమాకి మంచి టీంనే పనిచేశారు. కొత్తదనంతో చేస్తోన్న ఈ సినిమా సుశాంత్ కెరీర్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

ఇక ఎఐ స్టూడియోస్, శాస్త్రా మూవీస్ పతాకాలపై రవిశంకర్ శాస్రి, హరీష్ కోయలగుండ్ల సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అన్నట్టు రవిశంకర్ శాస్రి భానుమతి గారి మనవడు కావడం విశేషం.

ట్రైలర్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :