టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ VD12 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు ‘కింగ్‌డమ్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక దీనికి సంబంధించిన టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌తో సాగిన కింగ్‌డమ్ టీజర్ ప్యూర్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ సినిమాలోని మెయిన్ ప్లాట్‌ను ఈ టీజర్‌లో రివీల్ చేశాడు ఎన్టీఆర్. తమ రాజు కోసం వెయిట్ చేస్తున్న ప్రజల కోసం విజయ్ దేవరకొండ ఎలాంటి భీకర యుద్ధానికి సిద్ధమవుతాడు అనేది ఈ సినిమా కథగా ఉండబోతున్నట్లు ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇక విజయ్ దేవరకొండ పాత్రను ఎలివేట్ చేసిన విధానం అయితే సూపర్ అని చెప్పాలి. టీజర్ చివర్లో విజయ్ దేవరకొండ చెప్పే ‘అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా’ అనే డైలాగ్ ఈ టీజర్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది.
ఈ టీజర్‌తో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేశాడు. అతని లుక్, అతని పాత్రను ఇంట్రడ్యూస్ చేసిన విధానం ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేశాయి. అనిరుధ్ రవిచందర్ మరోసారి తనదైన మ్యూజిక్‌తో ఈ టీజర్‌ను మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తనదైన మార్క్ టేకింగ్‌తో తెరకెక్కించాడు. మొత్తానికి ‘కింగ్‌డమ్’ టీజర్‌తో ఈ సినిమా ఎలాంటి విధ్వంసం సృష్టించబోతుందో శాంపిల్ చూపెట్టారు అని చెప్పాలి. ఈ ప్రెస్టీజియస్ నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా మే 30న ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి