“భీమ్లా నాయక్” టైటిల్ సాంగ్ సాకీని ఆలపించిన మొగిలయ్యకి పద్మశ్రీ..!

Published on Jan 26, 2022 12:00 am IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. అయితే తెలంగాణ నుంచి మొత్తం ఐదుగురు పద్మ పురస్కారలకు ఎంపిక కాగా.. అందులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “భీమ్లా నాయక్” చిత్రంలో టైటిల్ సాంగ్ సాకీని ఆలపించిన కిన్నెర దర్శనం మొగిలయ్యకి పద్మశ్రీ పురస్కారం లభించింది.

అసలు విషయానికి వస్తే నాగర్ కర్నూల్ జిల్లా, లింగాల మండలం, అవుసలికుంట గ్రామానికి చెందిన దర్శనం మొగిలయ్య 12 మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు. తన పూర్వీకుల నుంచి ఆ కళను వారసత్వంగా తీసుకున్నాడు. తరాల తెలంగాణ జీవన విధానాన్ని, చారిత్రక గాథల్ని ఒడిసిపట్టి, పాటల రూపంలో కిన్నెర మెట్ల ద్వారా ప్రచారం చేస్తున్నాడు. దీంతో తెలంగాణ ఏర్పాటు తర్వాత మొగిలయ్య ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర ప్రథమ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఉత్తమ కళాకారునిగా కూడా ఎంపిక చేసింది.

సంబంధిత సమాచారం :