తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం

Published on Dec 1, 2021 3:06 pm IST

తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో కలచి వేస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే శివ శంకర్ మాస్టర్, నిన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కిరణ్ అబ్బవరం సోదరుడు అయిన రామాంజులు రెడ్డి నేడు చెన్నూరు వద్ద రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. రామాంజులు సంబేపల్లి మండలం దుధ్యాల గ్రామం లో నివసిస్తున్నారు. తాజాగా జరిగిన సంఘటన తో కిరణ్ అబ్బవరం ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

సంబంధిత సమాచారం :