తన సోదరుడిపై కిరణ్ అబ్బవరం ఎమోషనల్ పోస్ట్.!

Published on Dec 3, 2021 2:00 pm IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యి మంచి విజయాలను అందుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అయితే ఇప్పుడు కూడా “సమ్మతమే” అనే ఫ్రెష్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉండగా ఊహించని రీతిలో మొన్ననే తన సోదరుడు రామాంజులు రెడ్డి ని రోడ్డు ప్రమాదంలో కోల్పోయాడు. దీనితో వారి ఇంట తీరని విషాదం నెలకొంది.

మరి ఇప్పుడు తన సోదరుడిని ఉద్దేశించి కిరణ్ పెట్టిన ఓ పోస్ట్ ప్రతి ఒక్కరినీ ఎంతో భావోద్వేగానికి లోను చేస్తుంది. రేయ్ కిరా.. మన ఊరికి సరైన రోడ్డు కూడా లేదు, మన ఇద్దరిలో ఎవరొకరు ఏదోకటి గట్టిగా సాధించి ఏమన్నా చెయ్యాలిరా అని చెప్పి తనని హీరోగా చూడడానికి లగ్జరీ లైఫ్ ని కూడా త్యాగం చేసాడని ఇప్పుడిప్పుడే తాను ఏదో సాధిస్తున్నాను అనే టైం కి ఇక అతను లేడు.

తాను ఎప్పుడూ అడుగుతుండేవాడు తనని ఎప్పుడు అందరికీ పరిచయం చేస్తానని ఏదైనా గట్టిగా సాధించినప్పుడు చేద్దాం అనుకున్నా కానీ ఇలా చెయ్యాల్సి వస్తుంది అని అనుకోలేదని భావోద్వేగానికి లోనయ్యాడు. నా వెనుక ఉన్నది నా అన్న అబ్బవరం రామాంజులు రెడ్డి” తాను రోడ్ ప్రమాదంలో తన ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి అని కిరణ్ ఈ పోస్ట్ ద్వారా తన సోదరునితో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసి తన బాధని వ్యక్తం చేసాడు.

సంబంధిత సమాచారం :