మాస్ “మీటర్” సాంగ్ లో కిరణ్ అబ్బవరం.!

Published on Mar 11, 2023 11:02 am IST

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ తో మంచి హిట్ అందుకొని మళ్ళీ ట్రాక్ లోకి రాగ ఇక నెక్స్ట్ అయితే సాలిడ్ మాస్ ట్రీట్ ఇచ్చేందుకు ఈ యంగ్ హీరో రెడీ గా ఉన్నాడు. అయితే ఆ చిత్రమే “మీటర్” కాగా ఈ చిత్రాన్ని రమేష్ కాడూరి దర్శకత్వం వహించగా ఈ సినిమా నుంచి వచ్చిన రీసెంట్ టీజర్ తో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక లేటెస్ట్ గా అయితే ఓ మాస్ సాంగ్ షూట్ లో బిజీగా ఉన్నట్టుగా కిరణ్ అబ్బవరం తమ సెట్స్ నుంచి పోస్ట్ చేసాడు. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో అయితే తాను కనిపిస్తుండగా బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ డాన్సర్స్ కనిపిస్తున్నారు. మరి దీనికి అయితే మాస్ సాంగ్ లోడింగ్ అంటూ కాప్షన్ కూడా పెట్టాడు ఏఈ యంగ్ హీరో. మరి ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందిస్తుండగా ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. అలాగే ఈ చిత్రం ఈ ఏప్రిల్ 7న రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం :