ఫిల్మ్ సిటీ లో “నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని” చివరి షెడ్యూల్!

ఫిల్మ్ సిటీ లో “నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని” చివరి షెడ్యూల్!

Published on Jun 10, 2022 11:10 AM IST

యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో చేస్తున్న సినిమా నేను మీకు బాగా కావాల్సినవాడిని. కొత్త దర్శకుడు కార్తిక్ శంక‌ర్ ని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నారు. రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం ఇందులో కొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ ఆడియోని ల‌హ‌రి ద్వారా మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో చిత్ర షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలిపారు దర్శక నిర్మాతలు. కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాస్ లుక్ లో అంద‌ర్ని ఆక‌ట్టుకుంటున్నాడు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

కిర‌ణ్ అబ్బ‌వ‌రం, సంజ‌న ఆనంద్‌, సోనూ ఠాకూర్, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా భాస్క‌ర్‌, స‌మీర్‌, సంగీత‌, నిహ‌రిక‌, ప్ర‌మోదిని, భరత్ రొంగలి త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణ‌ కోడి రామ‌కృష్ణ‌, బ్యాన‌ర్‌ కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, లిరిక్స్‌ భాస్క‌ర్ భ‌ట్ల, ఎడిట‌ర్‌ ప్ర‌వీన్ పూడి, ఆర్ట్ డైర‌క్ట‌ర్‌ ఉపేంద్ర రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ భ‌ర‌త్ రొంగలి, పిఆర్ ఓ ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్‌, సినిమాటోగ్ర‌ఫి రాజ్ నల్లి, సంగీతం మ‌ణిశ‌ర్మ‌, కో ప్రోడ్యూస‌ర్‌ న‌రేష్ రెడ్ది మూలే, ప్రోడ్యూస‌ర్‌ కోడి దివ్య దీప్తి, డైర‌క్ట‌ర్‌ కార్తిక్ శంక‌ర్‌ లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు