ఇంట్రెస్టింగ్ టైటిల్ తో కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా ఎంట్రీ

ఇంట్రెస్టింగ్ టైటిల్ తో కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా ఎంట్రీ

Published on Jul 10, 2024 12:37 PM IST

టాలీవుడ్ షైనింగ్ హీరోస్ లో ఒకడైన యంగ్ అండ్ టాలెంటెడ్ కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రీసెంట్ చిత్రాలు తనకి అనుకున్న రేంజ్ హిట్ గా నిలవని సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాల రిలీజ్ తర్వాత తాను పెళ్లి చేసుకొని సినిమాలకి కొంచెం గ్యాప్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఫైనల్ గా తన నెక్స్ట్ సినిమాని ఇపుడు అనౌన్స్ చేసేసాడు. ఒక ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ తో ఇప్పుడు కిరణ్ అబ్బవరం ఎంట్రీ ఇచ్చాడు.

అయితే ఇందులో తాను వెనక్కి తిరిగి ఉన్న లుక్ లో కనిపిస్తుండగా సినిమాకి కేవలం “క” అనే టైటిల్ ని అనౌన్స్ చేశారు. అయితే ఇందులో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. క అనే టైటిల్ వెనుక రాశులు కనిపిస్తున్నాయి. అలాగే కింద హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఆ క అనే అక్షరం కనిపిస్తుంది. దీనితో గ్యాప్ తీసుకున్నా కూడా పాన్ ఇండియా ఎంట్రీ అయితే ఈ యంగ్ హీరో అందిస్తున్నాడు అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి శ్రీ చక్రాస్ బ్యానర్ నిర్మాణం వహిస్తుండగా సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు