కిరణ్ అబ్బవరం “వినరో భాగ్యము విష్ణు కథ” రిలీజ్ డేట్ పై లేటెస్ట్ అప్డేట్!

కిరణ్ అబ్బవరం “వినరో భాగ్యము విష్ణు కథ” రిలీజ్ డేట్ పై లేటెస్ట్ అప్డేట్!

Published on Oct 28, 2022 12:30 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం చివరిగా నేను మీకు బాగా కావాల్సినవాడిని చిత్రం లో కనిపించారు. ఆ సినిమాతో అభిమానులను, ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైన ఆయన ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ మూవీతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. వినరో భాగ్యము విష్ణు కథ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ విలేజ్ డ్రామా యొక్క రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ ఒక అప్డేట్ ను రిలీజ్ చేయడం జరిగింది. రేపు సాయంత్రం 05:02 గంటలకు సినిమా రిలీజ్ డేట్ పై ప్రకటన చేయనున్నారు మేకర్స్. ఇదే విషయాన్ని తెలియజేసేందుకు ఓ ప్రోమోను కూడా విడుదల చేశారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు