కిరణ్ అబ్బవరం “రూల్స్ రంజన్” రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం!

కిరణ్ అబ్బవరం “రూల్స్ రంజన్” రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం!

Published on May 27, 2022 12:17 PM IST


ఏ.ఎం రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్, స్టార్ లైట్ ఏంటర్ టైన్మెంట్ పతాకంపై కిరణ్ అబ్బవరం హీరోగా, వెన్నెల కిషోర్, హిమాని, వైశాలి, జయవాణి, ముంతాజ్, సత్య, అన్ను కపూర్, సిద్ధార్థ సేన్, అతుల్ పర్చురే, ఆశిష్ విద్యార్థి, అజయ్ కీలక పాత్రల్లో రత్నం కృష్ణ దర్శకత్వంలో వస్తున్న నూతన చిత్రం రూల్స్ రంజన్.

ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు క్రిష్, హీరో కిరణ్ అబ్బవరం పై చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, దర్శక నిర్మాత ఏ.ఎం రత్నం స్క్రిప్ట్ అందించి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ రోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.

కిరణ్ అబ్బవరం ,వెన్నెల కిషోర్, సత్య, అన్ను కపూర్, సిద్ధార్థ సేన్, అతుల్ పర్చురే, ఆశిష్ విద్యార్థి, అజయ్,
గోపరాజు రమణ, జెమినీ సురేష్, తులసి, అభిమన్యు సింగ్, హిమాని, వైశాలి, జయవాణి, ముంతాజ్, మనోహర్ సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రైటర్, డైరెక్టర్ రత్నం కృష్ణ, కో డైరెక్టర్ శ్రీకాంత్, కో ప్రొడ్యూసర్ రింకు కుక్రెజ, లైన్ ప్రొడ్యూసర్ అండ్ కో డైరెక్టర్ కే రంగనాథ్, డిఓపి దులీప్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ అమ్రేష్ గణేష్, ఆర్ట్ డైరెక్టర్ ఎం. సుధీర్, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్, ఎడిటర్ వరప్రసాద్, పబ్లిసిటీ డిజైనర్ అనంత్ లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు