కిరణ్ అబ్బవరం హీరోగా మరొక చిత్రం ప్రారంభం

Published on Nov 29, 2021 5:34 pm IST

ప్రముఖ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్‌, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ల నిర్మాణంలో కిరణ్ అబ్బవరం హీరోగా నేడు నూతన చిత్రం ప్రారంభం అయింది. రాజా వారు రాణీగారు, ఎస్‌ఆర్ కల్యాణ మండపం చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రామిసింగ్ కథానాయకుడు కిరణ్ అబ్బవరం హీరోగా సోమవారం హైదరాబాద్‌లో ఓ చిత్రం ప్రారంభమైంది.

అగ్ర కథానాయకులతో, స్టార్ డైరక్టర్లతో సినిమాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రీ మూవీమేకర్స్, ఇటీవల మత్తు వదలరా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ దర్శకులు కేఎస్ రవీంద్ర, గోపీచంద్ మలినేనిల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన రమేష్ కాదూరి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

పక్కా మాస్ కమర్షియల్ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పకులు. ముహుర్తపు సన్నివేశానికి యువ దర్శకుడు కేఎస్ రవీంద్ర కెమెరా స్వీచ్చాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ గారు క్లాప్ నిచ్చారు. మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని ముహుర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు.

ఈ చిత్రానికి కెమెరా వెంకట్.సి.దిలీప్, ప్రొడక్షన్ డిజైనర్ జేవీ, సంభాషణలు రమేష్ కాదూరి, లైన్ ప్రొడ్యూసర్ అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత బాబా సాయికుమార్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాలసుబ్రమణ్యం కేవీవీ, ప్రొడక్షన్ కంట్రోలర్ సురేష్ కందుల. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం రమేష్ కాదూరి లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :