కిరణ్ అబ్బవరం “నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని” నుంచి మరో మాస్ ట్రాక్.!

కిరణ్ అబ్బవరం “నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని” నుంచి మరో మాస్ ట్రాక్.!

Published on Aug 14, 2022 12:18 PM IST

టాలీవుడ్ లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో చేస్తున్న సినిమా “నేను మీకు బాగా కావాల్సినవాడిని” కోసం అందరికీ తెలిసిందే. “S R కళ్యాణమండపం” లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

రాజావారి రాణిగారు, ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం.. ఇందులో చాలా కొత్తగా కమర్షియల్ గా కనిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి “నచ్చావ్ అబ్బాయి” పాట విడుదలైంది.ఇదివరకే విడుదలైన ఈ సినిమా పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇప్పుడు ఈ చిత్రం నుండి ఒక మాస్ బీట్ ను రిలీజ్ చేసారు.

“నచ్చావ్ అబ్బాయి” పాటలో కిరణ్ అబ్బవరం వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆడియోని ల‌హ‌రి ద్వారా మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా వస్తోంది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాస్ లుక్ లో అంద‌ర్ని ఆక‌ట్టుకుంటున్నాడు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు మేకర్స్ వెళ్లడించనున్నారు.

ఇక ఈ సినిమా టెక్నికల్ టీమ్: స‌మ‌ర్ప‌ణ‌.. కోడి రామ‌కృష్ణ‌, బ్యాన‌ర్‌.. కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, లిరిక్స్‌.. భాస్క‌ర్ భ‌ట్ల, ఎడిట‌ర్‌.. ప్ర‌వీన్ పూడి, ఆర్ట్ డైర‌క్ట‌ర్‌.. ఉపేంద్ర రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ .. భ‌ర‌త్ రొంగలి, పిఆర్ ఓ.. ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్‌, సినిమాటోగ్ర‌ఫి.. రాజ్ నల్లి, సంగీతం.. మ‌ణిశ‌ర్మ‌, కో-ప్రోడ్యూస‌ర్‌.. న‌రేష్ రెడ్ది మూలే, ప్రోడ్యూస‌ర్‌.. కోడి దివ్య దీప్తి, డైర‌క్ట‌ర్‌.. శ్రీధర్ గాదె (SR కళ్యాణమండపం ఫేమ్) లు అందిస్తున్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు