ఇంట్రెస్టింగ్ గా కిరణ్ అబ్బరవరం కొత్త సినిమా ఫస్ట్ లుక్.!

Published on Apr 10, 2022 10:18 am IST

టాలీవుడ్ లో రైజ్ అవుతున్న లేటెస్ట్ యంగ్ హీరోస్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఒకడు. అయితే రీసెంట్ గా తాను చేసిన సెబాస్టియన్ సినిమా అంతగా ఆకట్టుకోలేదు కానీ అది మినహా తన నుంచి మరిన్ని ఆసక్తికర సినిమాలు లైనప్ లో ఉన్నాయి.

అయితే ఈ లైనప్ లో ప్రముఖ హిట్ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నుంచి అనౌన్స్ చేసిన చిత్రమే “వినరో భాగ్యము విష్ణు కథ”. ఆ మధ్య ప్రీ లుక్ పోస్టర్ తో మంచి ఆసక్తిగా రేపిన ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ ని ఏఈ శ్రీరామ నవమి కానుకగా రిలీజ్ చేశారు.

మరి ఇది మంచి మాసివ్ గా ఉందని చెప్పాలి గుడి, గుడి ముందు సంక్రాంతి ఎద్దు అలాగే దాని పక్కన సన్నాయి పట్టుకొని హీరో కిరణ్ మంచి మాస్ లుక్ లో కనిపిస్తునాడు. అయితే ఇది మంచి యాక్షన్ సీక్వెన్స్ లోది లా అనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే ఈ సినిమా కూడా తన కెరీర్ లో మంచి హిట్ అయ్యేలా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :