రేపే కిరణ్ అబ్బవరం నెక్స్ట్ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్!

రేపే కిరణ్ అబ్బవరం నెక్స్ట్ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్!

Published on Jul 9, 2024 7:00 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఇటీవల చిన్న బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. మంచి కంటెంట్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకే కిరణ్ అబ్బవరం ఈ బ్రేక్ తీసుకున్నారట. దాదాపు ఏడాది తర్వాత ఆయన తన కొత్త సినిమాకి సంబందించిన అప్డేట్ రాబోతుంది.

శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గోపాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కిస్తున్నారు. 20 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం కానుందని సమాచారం. ఈ చిత్రం టైటిల్ ను నేడు అనౌన్స్ చేయాల్సి ఉంది. అయితే పలు కారణాల వలన రేపటికి వాయిదా వేశారు. రేపు ఉదయం 11:16 గంటలకు టైటిల్ అనౌన్స్ మెంట్ ఉంటుంది అని హీరో కిరణ్ అబ్బవరం సోషల్ మీడియాలో తెలిపారు. అయితే హనుమంతుడి పోస్టర్ ను ఒకటి విడుదల చేశారు. ఈ చిత్రంకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు