ఫుల్ ఫన్ మోడ్ లో “రూల్స్ రంజన్” ట్రైలర్.!

Published on Sep 8, 2023 12:07 pm IST


మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా యంగ్ బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్ గా దర్శకుడు రథినం కృష్ణ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “రూల్స్ రంజన్”. మరి మొదటి నుంచి మంచి బజ్ ఉన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ లేటెస్ట్ గా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ ఫుల్ ఫన్ మోడ్ లో ఉంది అని చెప్పాలి.

నటుడు వెన్నెల కిషోర్ అలానే కిరణ్ అబ్బవరం టైమింగ్ లు సాలిడ్ గా పేలాయి. అలాగే కిరణ్ గత చిత్రాలతో పోలిస్తే ఇది కొంచెం సెటిల్డ్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మాస్ ఎలిమెంట్స్ ని తగ్గించి కిరణ్ నుంచి ఫుల్ ఫన్ తో ఈ సినిమాని మేకర్స్ ప్లాన్ చేసినట్టుగా ఈ ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. అలాగే హీరోయిన్ నేహా శెట్టి తన గ్లామ్ తో పాటుగా కిరణ్ అబ్బవరం తో మంచి కెమిస్ట్రీ కూడా కనబరిచింది.

అలానే అమ్రీష్ ఇచ్చిన మ్యూజిక్ కూడా ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా ఉందని చెప్పొచ్చు. ఇలా మొత్తానికి అయితే ఈ రూల్స్ రంజన్ ఈ సెప్టెంబర్ 28న మంచి ఫన్ ట్రీట్ ఇచ్చేలా ఉన్నాడని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించగా ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం సమర్పణలో విడుదల చేస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :