ఫీల్ గుడ్ ప్రామిసింగ్ గా “సమ్మతమే” గ్లింప్స్.!

Published on Oct 21, 2021 10:50 am IST

యంగ్ అండ్ తెలంటేడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమా “సమ్మతమే”. లాస్ట్ “ఎస్ ఆర్ కళ్యాణమండపం” తో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న కిరణ్ ఈసారి దర్శకుడు గోపినాథ్ రెడ్డి తో చేసిన సినిమానే “సమ్మతమే”. మరో యంగ్ అండ్ టాలెంటెడ్ నటి చాందిని చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నుంచి ఇపుడు మేకర్స్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.

అయితే ఇది మాత్రం ప్రామిసింగ్ గా ఉందని చెప్పొచ్చు. మెయిన్ లీడ్ ఇద్దరు మధ్య కెమిస్ట్రీ సినిమా బ్యాక్ డ్రాప్ ఇద్దరు మధ్య మాటలు అంతా ఆసక్తిగా అనిపిస్తూ ఫీల్ గుడ్ గా ఉన్నాయి. అలాగే శేఖర్ చంద్ర బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇందులో బాగుంది. ఓవరాల్ గా మాత్రం ఈ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లైనప్ బాగానే ఉందని చెప్పొచ్చు. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి. ఇకపోతే ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మాణం వహించారు.

గ్లింప్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

More