సెన్సార్ కంప్లీట్ చేసుకున్న కిరణ్ అబ్బవరం “సెబాస్టియన్”.!

Published on Feb 26, 2022 12:54 pm IST

ప్రెజెంట్ టాలీవుడ్ సినిమా దగ్గర మంచి షైన్ అవుతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో యువ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఒకడు. మరి ఇప్పుడు వరుస ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తూ వస్తున్న కిరణ్ లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ సినిమా రిలీజ్ తో సిద్ధంగా ఉన్నాడు. ఆ సినిమానే “సెబాస్టియన్ పీసీ 524”.

దర్శకుడు బాలాజీ సయ్యపు రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో కిరణ్ ఇంట్రెస్టింగ్ పోలీస్ పాత్రలో నటించాడు. మరి వచ్చే వారం రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ సినిమా ఇప్పుడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ చిత్రానికి గాను సెన్సార్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ని అందజేశారు.

ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ఫన్నీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన నువేక్ష మరియు కోమలి ప్రసాద్ లు హీరోయిన్స్ గా నటించగా బి సిద్దిరెడ్డి, రాజు మరియు ప్రమోద్ లు నిర్మాణం వహించారు. మరి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే మార్చ్ 4న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :