“సమ్మతమే” రిజల్ట్ పై హీరో షాకింగ్ కామెంట్స్!

Published on Jun 27, 2022 1:40 pm IST

కిరణ్ అబ్బవరం హీరోగా, చాందిని చౌదరి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “సమ్మతమే”. కాగా ఈ సినిమా రిజల్ట్ పై హీరో కిరణ్ అబ్బవరం షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కిరణ్ మాట్లాడుతూ.. సమ్మతమే సినిమాకి కొన్ని చోట్ల మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కానీ, నా ‘ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం’ సినిమాకు కూడా మొదట్లో మిశ్రమ రివ్యూలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత ఆ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్ అందుకుంది.

ఇప్పుడు ‘సమ్మతమే’ సినిమాకి కూడా మార్నింగ్‌ షో తర్వాత మిశ్రమ రివ్యూలు వచ్చాయి. కానీ, అదే రోజు సాయంత్రం ఓ థియేటర్‌కు వెళ్లి చూస్తే హౌస్‌ ఫుల్‌ అయింది. కాబట్టి.. ‘సమ్మతమే’ కూడా బ్లాక్‌ బస్టర్‌ హిట్ అందుకుంటుంది అని నమ్మకం ఉంది’ అంటూ కిరణ్‌ అబ్బవరం చెప్పుకొచ్చాడు. పైగా ”ప్రేక్షకుల వల్లే ‘సమ్మతమే’ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిందని.. ఇది ప్రేక్షకుల విజయం అని కిరణ్ తెలిపాడు.

సంబంధిత సమాచారం :