అదరగొట్టిన “క”.. యూఎస్ లో సాలిడ్ వసూళ్లు

అదరగొట్టిన “క”.. యూఎస్ లో సాలిడ్ వసూళ్లు

Published on Oct 31, 2024 10:03 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ సబ్బవరం హీరోగా నటించిన అవైటెడ్ లేటెస్ట్ సినిమానే “క”. తన కెరీర్ లో కొంచెం గ్యాప్ తీసుకొని చేసిన ఈ సినిమా సాలిడ్ హైప్ ని సెట్ చేసుకొని తన కెరీర్ లో మరో మంచి బజ్ తో వచ్చిన సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమా ఈ దీపావళి కానుకగా విడుదలకి రాగ ఇక్కడ ఈ సినిమాకి తెలుగు ఆడియెన్స్ సాలిడ్ వెల్కమ్ ని అందించారు.

అయితే ఇది ఇది ఒక్క తెలుగు స్టేట్స్ లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా క సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ నమోదు చేయడం విశేషం. ఆ సినిమా నార్త్ అమెరికాలో కేవలం ప్రీమియర్స్ తోనే ఏకంగా లక్ష డాలర్స్ కి పైగా గ్రాస్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో కిరణ్ అబ్బవరం కెరీర్ లో “క” సినిమా భారీ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచేలా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సందీప్, సుజీత్ లు దర్శకత్వం వహించగా యూఎస్ లో శ్లోక సినిమాస్ వారు రిలీజ్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు